ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోకేశ్‌ దాతృత్వం... విలేకరులకు బీమాతో జీవితంపై ధీమా - నారా లోకేశ్ లేటెస్ట్ వార్తలు

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పాత్రికేయులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బీమాతో దీమా కల్పించారు. 62 మంది పాత్రికేయులకు బీమా చేయించారు. కొవిడ్ మ‌ర‌ణాల‌కూ బీమా వ‌ర్తించేలా ప్రీమియం చెల్లించారు.

nara lokesh
నారా లోకేశ్‌ తన దాతృత్వం... జర్నలిస్టులకు బీమా సౌకర్యం

By

Published : Jul 19, 2020, 5:17 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పని చేస్తున్న 62 మంది విలేకరులకు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. బీమా సౌకర్యం కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో.. వారికి బతుకుపై భరోసా కలిగేలా ఈ చర్య తీసుకున్నారు. కొవిడ్‌ పోరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్​గా పనిచేస్తున్న జర్నలిస్టులు మృత్యువాత పడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తున్న ప్రింట్‌, ఎలక్ట్రా నిక్‌ మీడియా జర్నలిస్టులందరికీ బీమా ప్రీమియాన్ని నారా లోకేశ్‌ చెల్లించారు. సహజ మరణానికి 10 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 20 లక్షల బీమా వర్తించనుంది. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్సు పత్రాలను ఆయా పాత్రికేయులకు లోకేశ్ స్వయంగా‌ అందజేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details