ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాత్రి పబ్​జీ ఆడతారు... పొద్దున్నే ప్రజలపై పడతారు' - సీఎం జగన్​పై నారా లోకేశ్ విమర్శలు

వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీని దక్షిణాది బిహార్​లా మార్చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రజలెవరైనా ఫేస్​బుక్​లో పోస్టు పెట్టాలంటే సీఎం జగన్​ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

nara lokesh
nara lokesh

By

Published : Jun 26, 2020, 6:58 PM IST

Updated : Jun 26, 2020, 7:53 PM IST

ముఖ్యమంత్రి జగన్ రాత్రి వేళ పబ్​జీ గేమ్ ఆడి... పొద్దున్నే ప్రజలపై పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్... వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మీడియాతో నారా లోకేశ్

రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు ఫుల్... అభివృద్ధి నిల్. 151 మందిని బాహుబలిగా ఎదుర్కొంటున్నారని అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. భారత దేశంలో ఎవరితో మాట్లాడిన దక్షిణాది బిహార్​లా ఏపీ మారిపోయిందని అంటున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు ఇదివరకు తమిళనాడులో ఉండేవి. వీటిని జగన్ రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆంధ్రా ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే... ఎవరైనా ఫేస్​బుక్​లో పోస్టు పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలి. రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. దేవుడున్నాడు... దేవుని స్క్రిప్టు ప్రకారమే మళ్లీ మీ అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:చెల్లింపులే జరగనప్పుడు అవినీతి ఎక్కడిది: నారా లోకేశ్

Last Updated : Jun 26, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details