NARA LOKESH ON MP VIJAYASAI MOBILE MISSING : దొంగ ఇంట్లోనే మరో దొంగ పడ్డాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లోనే దొంగలు పడితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌లోని వివరాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం స్కామ్, బ్రెజిల్ వ్యాపార వివరాలు అన్ని ఫోన్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సెల్‌ఫోన్ వెతికే పనిలో ఉన్నారన్న లోకేశ్.. పోలీసులంతా అటే వెళ్తే సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.
ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?: లోకేశ్ - ఎంపీ ఇంట్లో దొంగలు
LOKESH ON MP MOBILE MISSING : ఎంపీ విజయసాయి ఇంట్లోనే దొంగలు పడితే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులంతా ఫోన్ వెతకటం కోసం వెళ్తే.. సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.
LOKESH ON MP MOBILE MISSING
విజయసాయి ఫోన్ మిస్: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్‌ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్‌ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్లో అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 23, 2022, 10:37 PM IST