రాష్ట్రం అభివృద్ధికి.. మళ్లీ చంద్రబాబు రావాలి: బ్రహ్మణి - compaign
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని నారా బ్రహ్మణి ఆకాంక్షించారు. తన భర్త లోకేశ్ తరఫున గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రచారం చేపట్టారు.
నారా బ్రహ్మణి
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని నారా బ్రహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం 'కంఠంరాజు కొండూరు మహంకాళి ఆలయం'లో ప్రత్యేక పూజలు చేసి... ఎన్నికల ప్రచారం చేశారు. తన భర్త నారా లోకేశ్‌కు ఓటేసి, అఖండ మెజార్టీ చేకూర్చాలని ఓటర్లను కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెదేపాను మరోసారి గెలిపించాలని ఆమె కోరారు.
Last Updated : Apr 7, 2019, 10:43 PM IST