నంది నాటకోత్సవాల్లో కళాకారుల అసంతృప్తి - అవార్డు వెనక్కి Nandi Drama Festivals in Guntur District : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులుగా గుంటూరులో నిర్వహిస్తున్న 'నంది నాటకోత్సవాలు -2022' శుక్రవారంతో ముగిశాయి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వారం రోజుల పాటు జరిగిన ఉత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి అంబటి రాంబాబు ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురాళి, ఎండీ విజయకుమార్ రెడ్డి తదితరలు పాల్లొని విజేతలకు అవార్డులు అందజేశారు. ఎన్టీఆర్ రంగస్థల అవార్డును రామలింగ శాస్త్రి అందుకున్నారు. వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దక్కించుకుంది.
Prizes Will be Awarded to The Winners : పోటీల నిర్వహించిన ప్రతి విభాగంలోనూ బంగారం, వెండి, కాంస్య నందులను ప్రదానం చేశారు. సినిమాలు, టీవీలు వచ్చినా నాటకం ఎప్పటికీ బ్రతికే ఉంటుందని మంత్రి అంబాటి రాంబాబు వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ అవార్డులు అందజేసినట్లు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఎన్టీఆర్ రంగస్థల అవార్డు అందుకున్న రామలింగ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరులో వేడుకగా నంది నాటకోత్సవాలు
Award Will be Returned : గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో వచ్చిన అవార్డులు వెనక్కి ఇచ్చేయటం కలకలం రేపింది. కర్నూలుకు చెందిన లలిత కళా సమితి కళాకారులు తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. లలితకళా సమితి కళాకారులు శ్రీ కృష్ణా కమలపాలిక నాటకం ప్రదర్శించారు. అయితే ఆ నాటకానికి ఎలాంటి అవార్డు రాలేదు. వారి కళాసమితిలోని మేకప్ విభాగంలో ఎస్. శ్రీనివాసులకు అవార్డు వరించింది. అయితే నాటకానికి అవార్డు రాకపోవడం వల్ల కళాసమితి డైరెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మేకప్ విభాగంలో వచ్చిన అవార్డును వెనక్కి ఇచ్చేయమని సూచించారు. కళాసమితి డైరెక్టర్ సూచన మేరకు అవార్డును వేదికపై పెట్టి వచ్చేశాడు. జ్యూరీ సభ్యలకు తమ నాటకం ఎందుకు నచ్చలేదో చెప్పవలసిందిగా లలిత కళా సమితి డైరెక్టర్ ఓబులయ్య పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము పాల్లొన్న ప్రతి నాటకానికి అవార్డులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరుగుతున్న నంది నాటకోత్సవాలు ఓ వర్గానికి మేలు చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
నాటకోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - అవార్డులకు సిఫార్సు చేస్తే రాజీనామా చేస్తా : పోసాని
Nandi Drama Festivals :గుంటూరు జిల్లాలో డిసెంబరు 23 నుంచి 29 వరకు నంది నాటకోత్సవాలను అట్టహాసంగా ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి నిర్వహించారు. ఈ నాటకోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన కళాకారులు పౌరాణిక, సామాజిక ఇతివృతాలతో కూడిన నాటకాలను ప్రదర్శించారు. నాటకోత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యి కళాకారులు వేసే నాటకాలను తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనించిన వారికి అవార్డులు అందజేశారు.