ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిల్లీకి వెళ్లొచ్చిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు'

దిల్లీలో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిపై ద్వేషం చూపించవద్దని ముస్లిం మత పెద్దలు కోరారు. వైరస్ తాము స్పష్టించినది కాదని... అది విదేశాల నుంచి వచ్చిందని అన్నారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చినవారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు.

muslims on Tabligi Jamat In delhi incidents
muslims on Tabligi Jamat In delhi incidents

By

Published : Apr 5, 2020, 7:25 PM IST

దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరారు. గుంటూరు నల్లచెరువులోని మదర్సాలో వారు మీడియాతో మాట్లాడారు. దిల్లీలో సమావేశానికి వెళ్లొచ్చిన వారిని అంటరానివారిగా, దేశ ద్రోహులుగా చూస్తున్నారని అది మంచి విధానం కాదని అన్నారు. ప్రభుత్వం సూచనలు మేరకు మత సమావేశానికి వెళ్లి వచ్చిన వారందరూ పరీక్షలకు సహకరిస్తున్నారని వెల్లడించారు. త్వరలో జరగనున్న పెద్దల పండుగ, రంజాన్ వంటి పర్వదినాలకు కూడా మసీదులకు రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details