ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో హత్యలు కలకలం.. ఒకే రోజు నలుగురు - Crime news

Murders in various places: రాష్ట్రం లోని వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలు కలకలం రేపుతున్నాయి. గుంటూరులోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న యమహా షోరూమ్ వాచ్‌మెన్‌ని.. అరండల్‌పేట పదో లైన్ లిక్కర్ మార్ట్ వాచ్‌మెన్​ని దుండగులు కొట్టి హతమార్చారు. అదే విధంగా అనకాపల్లి జిల్లాలోని రెండు హత్యలు జరిగాయి.. జిల్లాలో ఓ దళిత యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాళ్లు, చేతులు కట్టేసి బావిలో పడేశారు. మరో చోట హత్య చేసి మృతదేహాన్ని గోని సంచెలోపెట్టిన సంఘటన భయాందోళనలు రేకెత్తించింది. తల మెండెం వేరుచేసి సంచుల్లో పెట్టారు మొండెం భాగాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాగా పొగలు వ్యాపించాయి.

Murders in various places
Murders in various places

By

Published : Mar 1, 2023, 1:51 PM IST

Murders in various places: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పి. ఎల్ పురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ దళిత యువకుడిని గుర్తుతెలియని నిందితులు కాళ్లు, చేతులకు తాడుతో కట్టి హత్య చేసి వ్యవసాయ బావి లో పడేశారు. పీ.యల్ పురం గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేంద్ర ఇంటర్ వరకు చదివాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజాము న ఫోన్ రావడం తో ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగేంద్ర తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వెతికారు. అతడు పనిచేస్తున్న రైతు పొలంలోనే వ్యవసాయ బావిలో కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో అతని కనిపించింది. సమాచారం అందుకున్న నర్సీపట్నం డిఎస్పి ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకి తీయించి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పాసవికంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు.

గోని సంచెలోపెట్టి:అదే విధంగా మునగపాక మండలంలో గణపర్తిలో హత్య చేసి మృతదేహాన్ని గోని సంచెలోపెట్టిన సంఘటన భయాందోళనలు రేకెత్తించింది. తల మెండెం వేరుచేసి సంచుల్లో పెట్టారు మొండెం భాగాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాగా పొగలు వ్యాపించాయి. గమనించిన గ్రామస్తులుపోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్సీపట్నంకు చెందిన గాలి శ్రీను అనే వ్యక్తి గ్రామంలో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు.దుకాణం వద్ద పెంకుటిల్లు లో మృతదేహం లభ్యం అయింది. గత కొన్ని రోజులుగా శ్రీను కనిపించడం లేదు. మృతదేహం ఎవరిది అన్న వివరాలు తెలియాల్సి ఉంది. మునగపాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇద్దరు వాచ్ మెన్లు దారుణ హత్య:గుంటూరులో ఇద్దరు వాచ్ మెన్లు దారుణ హత్యకు గురయ్యారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ ఘటనలు నగర వాసుల్ని ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే... ఆరండల్ పేట పోలీస్ స్టేషన్ కు కూతవేటుదూరంలో వెంకటేశ్వర్లు అనే వాచ్ మెన్ హత్యకు గురయ్యాడు. మరోవైపు అమరావతి రోడ్డులోని ఓ ద్విచక్రవాహన షో రూమ్ వద్ద కృపానిధి అనే వాచ్ మన్ సైతం ఇదేవిధంగా హత్యకు గురయ్యాడు. రెండు హత్యలకు సారూప్యత కన్పిస్తోంది. పొట్టకూటి కోసం విధులు నిర్వహించే వాచ్ మెన్లపై దాడి చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలు అంతబట్టడం లేదు. ఆరండల్ పేట ప్రాంతంతోపాటు పాత గుంటూరు లోనూ కొన్ని దుకాణాలు చోరీకి గురయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే అంతర్రాష్ట్ర ముఠాలు ఏమైనా సంచరించాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తెలిసిన వెంటనే గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

ఇవీ చదవడి:

ABOUT THE AUTHOR

...view details