గుంటూరు జిల్లా.. తెనాలి మున్సిపల్ పీఠాన్ని వైకాపా సొంతం చేసుకుంది. మొత్తం 40 వార్డులకు గాను 32 వార్డుల్లో వైకాపా, 8 వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 40 మంది అభ్యర్థులతో మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆనంద నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛైర్పర్సన్ అభ్యర్థినిగా సయ్యద్ కాలేదా నసీమ్‌ను 15వ వార్డుకు చెందిన గుంటూరు కోటేశ్వరరావు, 39వ వార్డునకు చెందిన గడ్జేటి ఝాన్సీవాణి బలపరిచారు. మిగిలిన సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమె ఎన్నికయ్యారు. 35వ వార్డుకు చెందిన గొడవర్తి శ్రీ సాయి హరే రామ్, 12వ వార్డుకు చెందిన కొర్ర యశోద రమావత్లు వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా మాలేపాటి హరిప్రసాద్‌ను బలపరిచారు. మిగిలిన కౌన్సిల్ అభ్యర్థులు మద్దతుతో ఎన్నికయ్యారు.
తెనాలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సయ్యద్ కాలేద నసీం, వైస్ ఛైర్మన్‌గా హరిప్రసాద్
తెనాలి పుర పీఠాన్ని వైకాపా సొంతం చేసుకుంది. వైకాపా తరపున గెలిచిన 21వ వార్డు అభ్యర్థి సయ్యద్ కాలేద నసీంను ఛైర్‌పర్సన్‌గా.. అదే పార్టీకి చెందిన 7వ వార్డు అభ్యర్థి మాలేపాటి హరిప్రసాద్‌ను వైస్ ఛైర్మన్‌గా కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నారు.
municipal councilors