గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈనెల 31న శనివారం వనమహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు. సుమారు ఐదువేల మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. వనమహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత జగన్ సభలో ప్రసంగిస్తారు. స్థానిక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అటవీ అధికారులు, గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి అధికారులు పనులను పరిశీలించారు.
వనమహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు - arrengements
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 31న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
సీఎం పర్యటన