ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణ కోస్తాలో వైసీపీకి దడ - పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీతో సంప్రదింపులు - AP Latest News

MPs and MLAs Joining TDP from YCP: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ ఒన్ ఫ్లస్ ఒన్ బంపర్ ఆఫర్​లు పండుగ సీజన్​లో తరచూ చూస్తుంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ముగ్గురు వస్తాం ఒక్కరికి టిక్కెట్ ఇవ్వండి చాలంటూ మెగా బంపర్ ఆఫర్​లతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం తలుపు తడుతున్నారు. ఫిరాయింపు దారుల పట్ల తెలుగుదేశం మాత్రం ఆచుతూచి అడుగులు వేస్తోంది. పార్టీ గేట్లు ఎత్తితే మాత్రం తెలుగుదేశంలో చేరే ఎమ్మెల్యేలు, ఎంపీల జాబీతా భారీగానే ఉంది.

ycp_joins_tdp
ycp_joins_tdp

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 7:10 AM IST

దక్షిణ కోస్తాలో వైసీపీకి దడ - పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీతో సంప్రదింపులు

MPs and MLAs Joining TDP from YCP:దక్షిణ కోస్తాలో అధికార వైసీపీకి గుండెల్లో దడ మొదలైంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జగన్‌ తీరుతో విసుగుచెంది పార్టీని వీడగా ఇప్పుడు కీలక నేతలు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జగన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివాదరహితులు, విజయావకాశాలు ఉన్న వారిని చేర్చుకునేందుకు తెలుగుదేశం సైతం పచ్చజెండా ఊపడంతో వీరంతా దాదాపు ఆ పార్టీలో చేరడం ఖాయమే. గత ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.

ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అగ్రనాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు తెలుగుదేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివాదరహితులు, విజయావకాశాలు ఉన్న నాయకులను చేర్చుకునేందుకు తెలుగుదేశం నాయకత్వం సైతం మొగ్గు చూపుతోంది. కీలకమైన ఐదారుగురు నేతలు తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖాయమైంది.

ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ - అవమానంతో పార్టీని వీడుతున్న నేతలు

MP and MLA in position Changes in YCP:వైసీపీ బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో కీలక నేత తెలుగుదేశం తలుపు తట్టారు. జిల్లాపై పట్టున్న మాజీమంత్రి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై రగిలిపోతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గెలిచిన సిటింగ్ స్థానం నుంచి మరోచోటకు మారాలని జగన్‌ సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సిటింగ్ స్థానం నుంచే పోటీలో ఉంటానని అధిష్టానానికి తెగేసి చెప్పినా తన అభిమతాన్ని పార్టీ గౌరవిస్తుందన్న నమ్మకం లేదు. దీంతో ఆయన తెలుగుదేశంలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం ఒంగోలు లోక్‌సభ సీటుతోపాటు 4 అసెంబ్లీ స్థానాలు సూచించింది.

ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానమే కావాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకే చెందిన ఎమ్మెల్యే శుక్రవారం జగన్‌ను కలవగా ఆయన్ను ఒంగోలుకు మారాల్సిందిగా సూచించారు. తన సిటింగ్‌ స్థానాన్నే కేటాయించాలని ఆయన పట్టుబట్టారు. లేని పక్షంలో ఒంగోలు లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి హామీ లభించకపోవడంతో ఆయన కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ సీటు ఇస్తామని తెలుగుదేశం హామీ ఇవ్వగా తన సిటింగ్ స్థానామే కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

'విశ్వసనీయత అంటే మాదీ నాదీ' అంటూనే నయవంచన- ఇదే జగ'నైజం'

MP and MLAs Leaving YCP:వైసీపీ హయాంలో వ్యాపారపరంగా తీవ్ర ఇబ్బందులుపడిన ఓ ఎంపీ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అర్థబలానికి కొదవలేని ఆయన్ను ఎక్కడ సర్దుబాటు చేయాలోనని తెలుగుదేశం పరిశీలిస్తోంది. ఆయన టిక్కెట్‌ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి చేరికపై ఆధారపడి ఉంది. కృష్ణా జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత జగన్‌ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంగ, అర్థబలాలు పుష్కలంగా ఉన్న ఈ నేత తెలుగుదేశంతో సంప్రదింపులు జరపగా ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నూజివీడు నుంచి బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది.

రాజ్యసభ ఎంపీగా త్వరలోనే పదవీ విరమణ చేయనున్న దక్షిణ కోస్తాకు చెందిన వైసీపీ కీలక నేత తెలుగుదేశంతో టచ్‌లో ఉన్నారు. ఆయన పార్టీలో చేరడం ఖాయమైతే నెల్లూరు లోక్​సభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశముంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీని మరో స్థానానికి మారాలని వైసీపీ అధినాయకత్వం సూచించింది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట స్థానమే ఇస్తామని హామీ ఇచ్చింది.

పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

ABOUT THE AUTHOR

...view details