అమరావతి - అనంతపురం ఎక్స్ప్రెస్ మార్గాన్ని మెగా ఎక్స్ప్రెస్ వేలో చేర్చి... 23వ రహదారిగా అభివృద్ధి చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే ఈ మార్గాన్ని త్వరగా పూర్తయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం... దేశ వ్యాప్తంగా రానున్న నాలుగైదేళ్లలో 3.3 లక్షల కోట్ల వ్యయంతో 8 వేల కి.మీ మేర రహదారులను అభివృద్ధి చేస్తోందని, ఈ మెగా ఎక్స్ప్రెస్ వే పనుల్లో హైదరాబాద్ - విశాఖపట్నం, నాగపూర్ - విజయవాడ ఎక్స్ప్రెస్ మార్గాలను చేర్చటం పట్ల కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.