'తెదేపా అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తామని చెప్పాము. ఈ విషయం మేనిఫెస్టోలో పొందుపరిచాము. రాజధాని తరలింపు ప్రభావం.. మున్సిపల్ ఎన్నికలపై ఉంటుంది. పట్టణ ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు పాల్పడినట్లు.. నగరాల్లో చేయటానికి కుదరదు. పుర పోరులో నగర ప్రజలు తెదేపాను కచ్చితంగా గెలిపిస్తారు.- గల్లా జయదేవ్, గుంటూరు ఎంపీ
బెదిరింపులు కుదరవ్.. పట్టణ ప్రజలు తెదేపా వైపే: ఎంపీ గల్లా - గల్లా జయదేవ్ తాజా వార్తలు
రాజధాని తరలింపు అంశం పురపోరుపై ప్రభావం పడనుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపు రాజకీయాలకు వైకాపా తెర తీసిందని.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథా కొనసాగిస్తోందని ఆరోపించారు. పట్టణ ఓటర్లు తెలివిగా ఆలోచిస్తారని… తెదేపాను తప్పకుండా గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న గల్లా జయదేవ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
Last Updated : Mar 3, 2021, 7:07 AM IST