ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్​ వివేకా హత్య కేసు..ముగిసిన ఎంపీ అవినాష్​రెడ్డి విచారణ - cbi court

ys viveka murder case
ys viveka murder case

By

Published : Feb 24, 2023, 3:20 PM IST

Updated : Feb 24, 2023, 5:49 PM IST

17:47 February 24

సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా: అవినాష్‌

  • సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పా: అవినాష్‌
  • విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని ప్రచారం చేశారు: అవినాష్‌
  • దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు?: అవినాష్‌ రెడ్డి
  • దుబాయికి వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారు: అవినాష్‌ రెడ్డి
  • మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోంది: అవినాష్‌
  • ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు ప్రయత్నం: అవినాష్‌
  • ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం: అవినాష్‌
  • మరోసారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదు: అవినాష్‌
  • వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ: అవినాష్‌
  • నాకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చా: అవినాష్‌
  • నా విజ్ఞాపన పత్రంపై కూలంకషంగా విచారణ చేయాలని కోరా: అవినాష్‌
  • గూగుల్‌ టేక్‌అవుటా.. తెదేపా టేక్‌అవుటా.. అనేదాన్ని కాలమే నిర్ణయిస్తుంది: అవినాష్‌
  • సీబీఐ అఫిడవిట్‌ అంశాలను తెదేపా నేతలు ఏడాదిగా విమర్శిస్తున్నారు: అవినాష్‌
  • ఏడాదిక్రితం తెదేపా చేసిన ఆరోపణలే సీబీఐ కౌంటర్‌లో లేవనెత్తడం సందేహం కలుగుతోంది: అవినాష్‌
  • సీబీఐ విచారణ వాస్తవిక లక్ష్యంగా జరగడం లేదు: అవినాష్‌
  • వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందనే సందేహం కలుగుతోంది: అవినాష్‌
  • వివేకా చనిపోయినరోజు మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడా: అవినాష్‌
  • ఆ తర్వాత రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాను: అవినాష్‌
  • ఆరోజు ఏమి మాట్లాడానో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నా: అవినాష్‌
  • సీబీఐ అధికారులకు అదే చెప్పాను.. ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతా: అవినాష్‌
  • సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు: అవినాష్‌
  • సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా: అవినాష్‌
  • నేను వెళ్లేసరికే హత్య జరిగిన స్థలంలో లేఖ ఉంది.. అది ఎందుకు దాచారు: అవినాష్‌
  • లాయర్లను అనుమతించి ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగా: అవినాష్‌
  • ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు లేదు: అవినాష్‌ రెడ్డి

16:49 February 24

ఓ గదిలో ఉంచి ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారుల బృందం

  • ముగిసిన అవినాష్​రెడ్డి విచారణ
  • నాలుగు గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు
  • అవినాష్ రెడ్డి వెంట వచ్చిన ఇద్దరు న్యాయవాదులను లోపలికి అనుమతించని సీబీఐ
  • అవినాష్ రెడ్డిని ఓ గదిలో ఉంచి ప్రశ్నించిన సిబిఐ అధికారుల బృందం

15:13 February 24

కౌంటర్‌లో పలు కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ

  • హైదరాబాద్‌: సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ
  • రెండు గంటలుగా కడప ఎంపీ అవినాష్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
  • విచారణకు న్యాయవాదులతో కలిసి వచ్చిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • వైఎస్‌ వివేకా హత్య కేసులో ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
  • గత నెల 28న అవినాష్‌ను నాలుగున్నర గంటలు ప్రశ్నించిన సీబీఐ
  • తాజాగా సునీల్‌ యాదవ్‌ బెయిల్‌కు కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ
  • కౌంటర్‌లో పలు కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ
  • అన్ని విషయాలపై అవినాష్‌రెడ్డిని లోతుగా ప్రశ్నిస్తున్న సీబీఐ
Last Updated : Feb 24, 2023, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details