mother killed baby: రావెలలో దారుణం..రెండు రోజుల పసిపాపను చంపిన తల్లి - guntur news
07:45 December 09
ఆడపిల్ల పుట్టిందని దారుణం
mother killed 2 days baby: గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణం జరిగింది. కన్నతల్లే రెండు రోజుల పసిపాపను చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని తల్లి బొంత లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. లక్ష్మి దంపతులకు గతంలోనే అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో రెండు రోజుల పసిపాపను చంపేసి.. ఏమీ తెలియనట్లు ఆస్పత్రికి తీసుకొచ్చింది. వైద్య సిబ్బందికి అనుమానం వచ్చి నిలదీయడంతో ఈ ఘాతుకం వెలుగుచూసింది. వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి.