ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వందకుపైగా వెెంటిలేటర్లు ఉన్నా రోగులకు సేవలు శూన్యం - Ventilators in Tenali Hospital latest News

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి గతేడాది కేంద్రం 110 వెంటిలేటర్లను పంపిణీ చేసింది. ఆయా వార్డుల్లో వీటిని బిగించాల్సి ఉన్నా.. ఇంతవరకూ ఆ ఏర్పాట్లు ఏమీ చేయలేదు. కేవలం 20 వెంటిలేటర్లను మాత్రమే వార్డుల్లో అమర్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. మిగిలిన వెంటిలేటర్లను ఒక గదిలో నిల్వ ఉంచి తాళం వేశారు. గదిలోకి దుమ్ము ధూళి చొచ్చుకుపోయి పరికరాలు పాడయ్యే ఆస్కారం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వందకుపైగా వెెంటిలేటర్లు ఉన్నా.. రోగులకు సేవలు శూన్యం
వందకుపైగా వెెంటిలేటర్లు ఉన్నా.. రోగులకు సేవలు శూన్యం

By

Published : Apr 9, 2021, 5:51 PM IST


గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ మహమ్మారి బారి నుంచి రోగుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు ముందస్తుగా 110 వెంటిలేటర్లను సరఫరా చేసింది. గతేడాదిలోనే వీటిని పంపిణీ చేసినట్లు ఆస్పత్రి ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతం 20 వెంటిలేటర్లను మాత్రమే వినియోగిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ ఎం. సనత్ కుమారి పేర్కొన్నారు.

'అప్పుడు వాడుకలోకి తెస్తాం'

ఎక్కువమంది రోగులు వచ్చినప్పుడు మిగతావాటినీ వాడుకలోకి తెస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా రోగులకు బెడ్​లు సరిపోక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించిన సందర్భాలూ చోటు చేసుకున్నాయి.

'కలెక్టర్ అనుమతించారు'

కరోనా ఆస్పత్రిలో 220 పడకలకు జిల్లా కలెక్టర్ అనుమతించారని పేర్కొన్నారు. కొన్ని వెంటిలేటర్లను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వాడేందుకు ఉపయోగిస్తామని వెల్లడించారు. రోగుల తాకిడి అధికంగా ఉంటే.. వెంటనే మెకానిక్​ను పిలిపించి వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తామని వైద్యాధికారులు వివరించారు.

ఇప్పటికైనా మాకు వినియోగించాలి: రోగులు

మరో ప్రాథమిక అంశం సిటీ స్కాన్ పరికరం మొరాయించి ఏడాది కావస్తున్నా.. కనీసం లోపం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాత్తు జిల్లా ఆస్పత్రిలోనే సిటీ స్కానింగ్ పరికరం లేకపోవడం తమలో అసహనం రేకెత్తిస్తోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు.. ఆ వెంటిలేటర్లను శుభ్రపరిచి తమకు వినియోగించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి : ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే నా సైన్యం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details