ఓర్వలేకే బాబు పై మోదీ కక్ష-డొక్కా చంద్రబాబుపై ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.తన కంటేమంచి వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉన్నామోదీ సహించలేడని....సొంత పార్టీలో అడ్వాణీ....వెంకయ్య నాయుడును పక్కన పెట్టారన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన తెదేపా నాయకుల కార్యకర్తల సమావేశంలో డొక్కా పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలలో అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు. తెదేపాకు ఓటు వేసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు.