బదిలీల సమస్యపై ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడేందుకు ఇష్టపడని ఇద్దరు ఉన్నతాధికారులను విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. గుంటూరులో 'ప్రైవేటు విద్యారంగం-సంక్షోభం' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల పరిరక్షణకు ప్రభుత్వం చేయూత అందించాలని లక్ష్మణరావు కోరారు.
'ఉపాధ్యాయ బదిలీల వివాదంపై సీఎం స్పందించాలి' - ఏపీలో ఉపాధ్యాయ బదిలీలపై ఎమ్మెల్సీ లక్ష్మణ్ కామెంట్స్
ఉపాధ్యాయ బదిలీల వివాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గంటలో పరిష్కారమయ్యే సమస్యను విద్యాశాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు క్లిష్టం చేస్తున్నారని ఆరోపించారు.
'ఉపాధ్యాయ బదిలీల వివాదంపై సీఎం స్పందించాలి'
కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నెలకు 10వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ప్రైవేటు పాఠశాలలు విద్యారంగంలో ఎనలేని సేవలంస్తున్నాయని... ప్రైవేటు బడ్జెట్ స్కూళ్లపై అధికారుల వేధింపులు ఆపాలని మధు డిమాండ్ చేశారు.