పోలీసు వ్యవస్థను వైకాపా నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నివాసంలోకి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్రమంగా ప్రవేశిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాతో పాటు.. తెదేపా నేతలపై 8 సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. వైకాపా అరాచక పాలన చూస్తుంటే.. భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు.
'ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోరు' - government
చంద్రబాబు నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్