గుంటూరు జిల్లా తెనాలి రణరంగతోపులో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు. భారత దేశంలోనే చరిత్ర కలిగిన క్విట్ ఇండియా ఉద్యమం.. తెనాలిలో జరగడం మనందరికీ ఎంతో గర్వకారణమని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే అమరుల స్మృత్యార్థం వారి స్థూపాల దగ్గర నివాళులు అర్పించటం అధికారకంగా చేసిందని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.
'క్విట్ ఇండియా ఉద్యమం.. తెనాలికే గర్వకారణం' - గుంటూరు జిల్లా
క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నివాళులు అర్పించారు.
MLC Dokka Manikya Varaprasad and former minister Nakka Anandababu paid tribute to the seven members of the Quit India Movement at thenali in guntur district