రాజధాని మార్పుపై ఎవరికీ అపోహలు అవసరం లేదని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు సార్లు శాసనసభ సమావేశాలు ఈ ప్రాంతంలోనే నిర్వహించామని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇక్కడే ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను వక్రీకరించారన్నారు. రైతులకు అండగా ఉంటానన్న పవన్ హామీలు నెరవేర్చకుండా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. రాజధానిలో అభ్యర్థిని నిలబెట్టని పవన్.. ఏ భరోసా ఇవ్వటానికి వస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు.
రాజధానిపై అపోహలు వద్దు : ఎమ్మెల్యే ఆళ్ల - amaravati
రాజధాని మార్పుపై ఎవరికీ అపోహలు అవసరంలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఆళ్లరామకృష్ణా రెడ్డి
Last Updated : Aug 30, 2019, 6:48 AM IST