ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA Pinnelli: చంద్రయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే పిన్నెల్లి - టీడీపీ నాయకులు చంద్రయ్య హత్యపై స్పందించిన ఎమ్మెల్యే పిన్నెల్లి

YSRCP MLA Pennelli on TDp Leader Chandraiah Murder Case: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు చంద్రయ్య హత్యతో తనకు కానీ వైకాపాకు గానీ ఎలాంటి సంబంధం లేదని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామంలో వ్యక్తిగత గొడవలే దీనికి కారణమని ఆయన వివరించారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

By

Published : Jan 13, 2022, 3:41 PM IST

చంద్రయ్య హత్యతో మాకు ఏలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే పిన్నెల్లి

YSRCP MLA Pinnelli Ramakrishna Reddy: గుంటూరు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్య ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రయ్య హత్యతో తనకు కానీ వైకాపాకు గానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గ్రామంలో వ్యక్తిగత గొడవలే హత్యకు కారణమని ఆయన వివరించారు.

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలే లేవని.. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను పిన్నెల్లి కోరారు.

ఇదీ చదవండి..:Chandraiah Murder: చంద్రయ్య హత్యను ఖండించిన తెదేపా.. మధ్యాహ్నం గుండ్లపాడుకు చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details