ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి... అచ్చెనాయుడిని అరెస్ట్ చేశారు' - nimmala ramanaidu latest updates

బీసీలు తెదేపాకి వెన్నెముక అని..., ఇది ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి బీసీ నాయకులపైన వరుస కేసులు పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

mla nimmala ramanaidu visited ggh in guntur
మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు

By

Published : Jun 18, 2020, 5:24 PM IST



గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న తెదేపా నేత అచ్చెనాయుడును పరామర్శించేందుకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రామారాజు, ఏలూరి సాంబశివరావులు వెళ్లగా వారిని పోలీసులు అనుమతించలేదు. సూపరింటెండెంట్ సుధాకర్​ను కలిసి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని రామానాయుడు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న శస్త్ర చికిత్సకి మళ్లీ ఆపరేషన్ చేశారని తెలిపారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండి: నిందితుడికి కరోనా పాజిటివ్... పోలీసులకు కొవిడ్ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details