గుంటూరు నవభారత్ నగర్లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌తో కలిసి అమూల్ రిటైల్ దుకాణాన్ని ఎమ్మెల్యే బలరాం ప్రారంభించారు. సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయాలు చేయడం లేదని.. ప్రజా సేవ కోసం చేస్తున్నామని చెప్పారు. క్రీయాశీల రాజకీయాల్లో విరమించుకుందామనుకున్నానని.. కొన్ని కారణాల వల్ల గత ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని బలరాం పేర్కొన్నారు. డెయిరీ యాజమాన్యం చెసిన తప్పిదాల వల్ల.. ఒంగోలు డెయిరీకి నష్టం వాటిల్లిందని చెప్పారు.
'పాడి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతోనే అమూల్‌కు అవకాశం' - గుంటూరులో అమూల్ రిటైల్ దుకాణం ప్రారంభం వార్తలు
పాడి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో అమూల్ సంస్థకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని.. ఏ సంస్థనూ దెబ్బతీయడానికి కాదని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అభిప్రాయపడ్డారు. అమూల్ సంస్థ రాకతో మిగతా ప్రైవేటు సంస్థలు కూడా రైతులకు మంచి రేటు ఇస్తున్నాయని చెప్పారు.
mla karanam balaram on amul milk
TAGGED:
amul milk in ap news