గుంటూరు జిల్లా తెనాలి ఇండోర్ స్టేడియంని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలోని క్రీడాకారులను ఎక్కువగా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే బత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి అమరావతి ఫ్లాట్స్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని కానీ వైకాపా ప్రభుత్వం హయాంలో దాన్ని బాగా అభివృద్ధి చేసి ఎక్కువ మంది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెనాలి ప్రాంతాన్ని ఒక క్రీడా ప్రాంతంగా తీసుకొస్తామన్నారు. అధికారులతో కలిసి స్టేడియం అంతా పరిశీలించారు.
'తెనాలిని క్రీడలకు చిరునామాగా మారుస్తాం' - thenali
తెనాలి ప్రాంతానికి క్రీడా కళ తీసుకొస్తామనీ, క్రీడాకారులను ప్రోత్సాహిస్తామని, ఇక్కడి స్టేడియంను అభివృద్ధి చేస్తామని బత్తున శివకుమార్ అన్నారు.
తెనాలిని క్రీడా రంగంగా మారుస్తాం : బత్తున శివకుమార్