Miscreants Set Fire To Anna Canteen in Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కి దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే.. అర్ధరాత్రి సమయంలో అన్న క్యాంటీన్ తలుపు వద్ద దుండగులు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగటంతో గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
తెనాలిలో అన్న క్యాంటీన్‌కి నిప్పు పెట్టిన దుండగులు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Miscreants Set Fire To Anna Canteen in Tenali: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్లను.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ వాటిని మూసివేసి నిర్వీర్యం చేయటం ఒక వంతైతే.. మరో వైపు గుర్తు తెలియని దుండగులు వాటిని నాశనం చేసిన ఘటనలు ఎదురవుతున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది.
అన్న క్యాంటీన్
అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చిన టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్‌కి నిప్పుపెట్టటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 18, 2022, 7:57 AM IST