'ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలి' - విద్యా విధానంపై ప్రభుత్వం నిర్ణయాలు
నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉపాధ్యాయ సంఘాలు అనుసంధానకర్తగా ఉండాలని మంత్రి సురేశ్ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి విద్యా రెగ్యులేటరీ కమిషన్ వేసినట్లు మంత్రి సురేష్ గుర్తు చేశారు. విద్యారంగం సమస్యల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.