ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2021, 4:54 PM IST

ETV Bharat / state

మేం తలుచుకుంటే లోకేశ్​పై కేసు పెట్టలేమా?: మంత్రి అనిల్

రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై తెదేపా నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Minister_anil_yadav
Minister_anil_yadav

మేం తలుచుకుంటే లోకేశ్​పై కేసు పెట్టలేమా?: మంత్రి అనిల్

రాష్ట్రంలో కొంతమంది స్వార్థప్రయోజనాల కోసం మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ స్పష్టంగా వివరణ ఇస్తే.. తెదేపా బెంబేలెత్తిపోతోందని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

ఒక్కరోజులోనే డీజీపీ మాట మార్చారని తెదేపా నేతలు అంటున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు విచారణ చేయాలి. తెదేపా హయాంలో ఏ ఘటన జరిగినా వైకాపా కార్యకర్తల పని అని అప్పటి డీజీపీ చెప్పేవారు. అదేవిధంగా మేము ప్రవర్తిస్తే 29 ఘటనలు తెదేపా వారి పనే అని చెప్పేవాళ్లం కదా. 9 కేసుల్లో మాత్రమే ప్రతిపక్ష పార్టీ హస్తం ఉందని చెప్పాం. కొన్నింటిలో భాజపా వారి ప్రమేయం ఉందని చెప్పాం. మేం తలుచుకుంటే వీటి వెనుక నారా లోకేశ్ ఉన్నారని కేసు పెట్టలేమా?- అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details