ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరంగం సృష్టించిన ఆరోగ్య శ్రీ ట్రస్టు మాజీ ఉద్యోగి - mentally distrubed person

గుంటూరు రోడ్డుపై హంగామా సృష్టించిన ఆరోగ్య శ్రీ ట్రస్టు మాజీ ఉద్యోగి. మతిస్థిమితం తప్పి, సిఎం తో మాట్లాడుతానంటు గోల చేస్తున్న ఈ వ్యక్తిని పోలీసులు అతికష్టం మీద ఆసుపత్రికి తరలించిన అక్కడ్నుంచి పారిపోయినట్లు తెలిసింది.

mentally distrubed person at healthcare center in guntur

By

Published : Sep 7, 2019, 3:11 PM IST

ఆరోగ్య శ్రీ ట్రస్టు కార్యాలయంలో మతిస్థిమితం లేని యువకుడు హల్​చల్

గుంటూరు నగరంలో వీరకుమార్ రెడ్డి అనే మతిస్థిమితం లేని యువకుడు వీరంగం సృష్టించాడు.గతంలో ఆరోగ్య శ్రీ ట్రస్టు ఐటీ విభాగంలో పనిచేసే ఇతడ్ని ఇటీవలే ఉద్యోగం నుంచి తొలగించారు.దీంతో వీరకుమార్ చుట్టుగుంటలోని ఆరోగ్య శ్రీ కార్యాలయం సమీపంలో నానా హంగామా చేశాడు.తనవద్ద ఉన్న ల్యాప్ ట్యాప్,సర్టిఫికెట్లు,ఇతర వస్తువులు ఇష్టం వచ్చినట్లు పడేశాడు.నేను ఎవరి మాట వినను,నేరుగా ముఖ్యమంత్రితో మాట్లడతానంటూ గోల చేస్తున్నాడు.ప్రధాన రహదారిపై దాదాపు గంటసేపు హంగామా సృష్టించాడు.దీంతో స్థానికుల సాయంతో పోలీసులు అతడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు.అయితే,ఆసుపత్రి నుంచి వీరకుమార్ బయటకు వెళ్లినట్లు తెలిసింది.వీరకుమార్ రెడ్డి లభించిన ఆధారాలతో అతను,ప్రకాశం జిల్లా సత్యవీడు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details