ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ నిర్ణయంపై వైద్య విద్య అధ్యాపకులు హర్షం

బోధన ఆసుపత్రుల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ వేతనాలను, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గుంటూరులో బోధన వైద్యులు సీఎం జగన్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Nov 7, 2020, 5:49 PM IST

Published : Nov 7, 2020, 5:49 PM IST

medical-education-faculty
వైద్య విద్య బోధన అధ్యాపకులు హర్షం

ప్రభుత్వ వైద్యవిద్య బోధన ఆసుపత్రుల్లోని అధ్యాపకులకు యూజీసీ వేతనాలను, పీఆర్సీ(2016)ఆమోదించడం పట్ల వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వైద్యకళాశాలలో బోధిస్తున్న వైద్యులందరూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

14 ఏళ్ల బోధన వైద్యుల కలను సీఎం జగన్ సాకారం చేశారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావడానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఏపీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details