ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిన్నెల్లిలో విషాదం... వివాహిత సజీవ దహనం - guntoor

ఓ మహిళ దైనందిన జీవితంలో భాగంగా పనుల్లో నిమగ్నమైంది. ఇంట్లో వంట చేస్తోంది. ఏదో ఆలోచిస్తూ ఆదమరిచింది. ఆ ఏమరపాటే ఆమె జీవితానికి ముగింపు పలికింది.

పిన్నెల్లిలో విషాదం... వివాహిత సజీవ దహనం

By

Published : Jun 5, 2019, 2:46 AM IST

మాచవరం మండలం పిన్నెల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ సజీవ దహనం ఆ గ్రామాన్ని కలచివేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్​ బీ(43) ఇంట్లో వంట చేస్తోంది. ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకుంది. ఏం చేయాలో పాలుపోక... ఒక్కసారిగా ఆ మంటలతోనే పరుగు తీసింది. ఈక్రమంలో సమీపంలోని కంది కట్టెపై పడింది. ఆ కట్టెతోపాటే... ఆమె కూడా సజీవ దహనమైంది. మాచవరం ఇన్​చార్డి ఎస్సై టి.అశోక్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పిన్నెల్లిలో విషాదం... వివాహిత సజీవ దహనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details