గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్ను దారుణంగా హత్యచేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మెుత్తం ఏడుగురు నిందితులు హత్యలో పాల్గొన్నట్లు డీఎస్పీ రామృకృష్ణ స్పష్టం చేశారు. కాగా...తోట శ్రీను, సైదులు, పానయ్య, గోపి, హనుమంతరావు అనే ఐదుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా...వారి కోసం గాలిస్తున్నారు. వర్గపోరు, భూవివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితులను గుంటూరు సీసీఎస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. నిందితులు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
పోలీసుల ఎదుట మంగళగిరి హత్యకేసు నిందితులు - surrendering to police
గత రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్ను దారుణంగా హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వర్గపోరు, భూవివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.
మంగళగిరి హత్యకేసు నిందితులు