రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి, మందడం, కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. బేతంపూడి, కురుగల్లులో టైర్లు తగులబెట్టారు. రహదారులపై ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. అక్కడే పశువులను కట్టేసి నిరసనలు చేస్తున్నారు. రైతు దినోత్సవం నాడు తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.పలు చోట్ల షటిల్ ఆడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మందడంలో పోలీసులను బిచ్చమడిగి రైతులు నిరసన తెలిపారు.సచివాలయానికి వెళ్లే ఉద్యోగులను ఆపి భిక్షాటన చేస్తున్నారు.
'రైతు దినోత్సవం నాడు.. రోడ్డున పడేస్తారా?'
మంగళగిరి,మందడం,కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నినాదాలతో రహదారులన్ని మారుమ్రోగుతున్నాయి. టైర్లు తగులబెడుతున్నారు. పశువులను రోడ్డుపై కట్టేశారు. భిక్షాటన చేస్తూ...నిరసనలు చేస్తున్నారు.
మంగళగిరి,మందడంలో రైతుల నిరసనలు