అమరావతి వికేంద్రీకరణ చేయొద్దంటూ గుంటూరు జిల్లా క్రిష్ణాయపాలెంలో రైతులు నిరాహార దీక్షకు దిగారు. మహిళలు, చిన్నారులు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించిన సీఎం ఇప్పుడు అమరావతిని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. భారీ మెజారిటీతో ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు నెలల వ్యవధిలోనే కుప్పకూలాయని... వైకాపాకు అదే గతి పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి