ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2021, 9:44 AM IST

ETV Bharat / state

RAPE ATTEMPT: మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడిపై కేసు నమోదు..

ఇంటింటికీ తిరుగుతూ వెంట్రుకలకు బుడగలు, స్టీలు సామాను అమ్ముకునే ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం(RAPE ATTEMPT) చేయబోయాడో వ్యక్తి. ఆమె కేకలు వేయడంతో అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

man-rape-attempt-on-a-woman-at-guntur-district
మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడిపై కేసు నమోదు..

గుంటూరు జిల్లా అమరావతిలో వెంట్రుకలు కొనే మహిళపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. చెంచుకాలనీకి చెందిన ఓ మహిళ ఇంటింటికీ తిరుగుతూ తల వెంట్రుకలు తీసుకుని వాటి బదులుగా బుడగలు, స్టీలు సామాను అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆ క్రమంలోనే మంగళవారం ఉదయం వెంట్రుకలు కొనేందుకు స్థానిక గంటలమ్మ చెట్టు వద్దకు వెళ్లింది. ధరణికోట గ్రామానికి చెందిన కార్తీక్ కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు.

కార్తీక్ ఆమెను చూసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని సందులోకి లాక్కెళ్లి అత్యాచారం చేబోయాడు. వెంటనే మహిళ కేకలు వేయడంతో... భయపడి పారిపోయాడు. అతడి నుంచి తప్పించుకున్న తర్వాత మహిళ నేరుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:చావుబతుకుల మధ్య తల్లి.. చూసేందుకు ఇష్టపడని కొడుకు

ABOUT THE AUTHOR

...view details