గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రూ.16 వేల కోసం తమతోపాటు ఆటో నడుపుతున్న వ్యక్తిని ఆటోడ్రైవర్లు ఇంట్లో కట్టేశారు. వారినుంచి తప్పించుకుని వెళ్తుండగా టిప్పర్ ఢీకొని అతడు మృతి చెందారు. మృతుని భార్య షేక్ మహేబున్నీసా తెలిపిన వివరాల మేరకు.. బెల్లంకొండకు చెందిన షేక్ సుభానీ (33) ఆటోడ్రైవర్. స్థానికుడైన రెహమాన్ ఆటోకు డ్రైవరుగా సుభానీ వెళ్తున్నారు. వారితోపాటు గజని సొంత ఆటో నడుపుతున్నాడు. గజనికి చెందిన రూ.16వేలు రెహమాన్ ద్వారా మంగళవారం సుభానీ చేతికి అందాయి. అతనికి బెల్లంకొండలో రూ.20 వేల అప్పు ఉంది. అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి, ఆ నగదుతో పాటు సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆటో యజమానికి సుభానీ తెలియజేసి బుధవారం నగదు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. రెహమాన్, గజని వినిపించుకోకుండా అతడిని నిర్బంధించారు. విషయం తెలిసి సుభానీ భార్య అక్కడికి వెళ్లి తన భర్తను వదిలేయాలని బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు. ఈలోపు తప్పించుకునేందుకు రోడ్డుపైకి వచ్చిన సుభానీని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదుచేసినట్లు సీఐ శోభన్‌బాబు చెప్పారు.
రూ.16 వేల కోసం వ్యాపారి వేధింపులు.. తప్పించుకుని వెళ్తుండగా.. - సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం వార్తలు
రూ. 16 వేల కోసం తమతోపాటు ఆటో నడుపుతున్న వ్యక్తిని ఆటో డ్రైవర్లే నిర్భందించారు. వారి నుంచి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో దారుణం జరిగింది. టిప్పర్ ఢీకొని అతను మృతి చెందాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.
death