ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పురుగు పట్టిన బియ్యంతో.. మధ్యాహ్న భోజనం!

By

Published : Mar 26, 2022, 6:44 PM IST

పురుగు పట్టిన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి వినియోగించటంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై ఎంఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టి, జాయింట్ కలెక్టర్​కు నివేదిక అందిస్తామని వెల్లడించారు.

పురుగు పట్టిన బియ్యం
పురుగు పట్టిన బియ్యం

పురుగు పట్టిన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి వినియోగించటంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎంఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్​ రాజకుమారి ఆదేశాల మేరకు.. పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తనిఖీలు చేపట్టిన ఎంఈవో రమాదేవి, ఏడీ శ్రీనివాసరావు.. పాడైపోయిన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి వినియోగించటంపై పాఠశాల ప్రధానోపాధ్యాయినిపై మండిపడ్డారు. భోజనాన్ని రుచి చూసిన ఏడీ శ్రీనివాసరావు.. నాణ్యత లేని బియ్యాన్ని ఎందుకు వండి పెడుతున్నారని ప్రధానోపాధ్యాయిని ఇంద్రావతిని ప్రశ్నించారు. పాఠశాలలో 280 క్వింటాళ్ల బియ్యం ఎందుకు నిల్వ ఉంచారని ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టి, జేసీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details