విశాఖలో సానియామీర్జా ఫోటోకు పి.టి.ఉష పేరు పెట్టిన హోర్డింగ్ వైరల్ అయినదానిపై లోకేశ్ ట్విట్టర్‌లో స్పందించారు. వైకాపా ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్‌కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారని గుర్తుచేశారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు దార్శనికత అని లోకేశ్ అన్నారు.
'స్వాతిముత్యాల్లాంటి నేతల్లారా.... క్రీడాకారులను అవమానించకండి...'
సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలియని దురావస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ట్విట్టర్‌లో విమర్శించారు.
క్రీడా మంత్రికి క్రీడాకారులు తెలియదు
TAGGED:
లోకేశ్ ట్వీట్