ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హోంమంత్రి సొంత మండలంలోనే ఇలా ఉంటే ఎలా?' - lokesh tweets

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... వైకాపా ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. హోంమంత్రి సొంత మండలంలోనే శాంతి భద్రతల పరిస్థితి ఇలా ఉంటే... రాష్ట్రం సంగతి ఏంటని నిలదీశారు.

లోకేష్ ట్విట్టర్

By

Published : Jul 27, 2019, 8:42 PM IST

Updated : Jul 28, 2019, 2:02 AM IST

గుంటూరు జిల్లా పొనుగుపాడులో... తెదేపా నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఎవరైనా పర్యటించవచ్చునన్నా హోంమంత్రి... దీనికేమంటారని ప్రశ్నించారు. తెదేపా మద్ధతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా వైకాపా నేతలు గోడ కట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. ప్రజలను తెదేపా వాళ్లు కలిస్తే... వైకాపా దౌర్జన్యాలు బయటపడతాయని భయమా అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి సొంత మండలంలోనే శాంతి భద్రతల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం సంగతి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

లోకేష్ ట్విట్టర్
Last Updated : Jul 28, 2019, 2:02 AM IST

ABOUT THE AUTHOR

...view details