దిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని... నీరు, మట్టి మొహాన కొట్టి వెళ్లారని మోదీపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పిన వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని తరలించుకుపోతారన్నారు. రైతులు సాయం వల్లే అమరావతి నిర్మాణం సాధ్యమైందన్నారు. నిర్మాణాలు మరింత వేగంగా సాగాలంటే చంద్రబాబుకి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
రైతుల వల్లే రాజధాని సాధ్యమైంది: లోకేశ్ - guntur
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లోకేశ్