ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం నిర్వహించారు. మడలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయటం లేదన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మెుక్కజొన్నకు సబ్సిడీ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కరించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికి తాగునీరు : మంత్రి లోకేశ్ - duggirala
రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పసుపు-కుంకుమ పథకం దేశంలో ఎక్కడా ఆమలు చేయటం లేదన్నారు.
మంత్రి లోకేశ్ ప్రచారం