ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం నివాసంతో స్థానికులకు సమస్యలు - jagan

తాడేపల్లిలో సీఎం నివాసం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. భద్రతా చర్యల నెపంతో గ్రామంలోని పలు కాలనీల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ కారణంగా.. తాము కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులకు సమస్యలు

By

Published : Jul 6, 2019, 11:39 PM IST

స్థానికులకు సమస్యలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా చర్యల నెపంతో సీఎం నివాసానికి ఎదురుగా ఉన్న కరకట్టపై ఉన్న ఇళ్లకు... పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు విద్యార్థలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే గ్రామస్తులు కిలో మీటర్ దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీ దారులు తమ వాహనాలను స్థానికుల ఇంటి ముందు నిలిపడం.. మరో సమస్యగా మారింది. ఈ ఇబ్బందులు పరిష్కరించాలని... కరకట్టకు దిగువన ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని స్థానికులు వేడుకొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details