ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరునాళ్లకు ముస్తాబవుతున్న కోటప్పకొండ

మహా శివరాత్రికి ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ ముస్తాబవుతోంది. మార్చి 11వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా కొండపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రికూటేశ్వరుడి చెంత జాగారం చేసే భక్తులను అలరించేందుకు ఎలక్ట్రిక్ ప్రభలు సిద్ధమవుతున్నాయి. మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు.

By

Published : Mar 4, 2021, 10:58 AM IST

Kotappakonda preparing for the feast
తిరునాళ్లకు సిద్ధమవుతున్న కోటప్పకొండ

మహా శివరాత్రికి గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ట్రాక్టర్లు, లారీల్లో.. భారీ సంఖ్యలో కోటప్పకొండ జాతరకు భక్తులు తరలివస్తారు. కొండపై ఆలయం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలానందం, కాళింది మడుగు పుష్పవనానికి రంగులద్దుతున్నారు. మహాశివరాత్రి అంటేనే జాగారం.. కోటప్పకొండలో జాగారం చేసేందుకు కొదవేలేదు. పండుగ రోజున శ్రీ త్రికూటేశ్వరస్వామికి అధికసంఖ్యలో భక్తులు పాల్గొని.. ప్రత్యేక అభిషేకాలు చేస్తారు.

మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. తిరునాళ్ల రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అన్నీ భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ట్రాఫిక్ ఇబ్బందులకు.. ప్రధాన కారణమవుతున్న ప్రభలు తిరునాళ్ల రోజున సాయంత్రం 5 గంటల లోపే కొండకు చేరుకునేలా చూడాలని.. పోలీసులను ఎస్పీ ఆదేశించారు. తిరునాళ్లకు విచ్చేసే భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details