మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరగనుంది. స్థానిక ఎస్.ఎస్.ఎన్. ఇంజనీరింగ్ కళాశాలలో సంతాప సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పల్నాడు తోపాటు జిల్లావ్యాప్తంగా వేలాదిమంది కోడెల అభిమానులు, తెదేపా కార్యకర్తలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంస్మరణ సభకు రానున్నారని నేతలు వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో భోజనం, వసతి, భద్రత పరంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కోడెల సంస్మరణ సభకు ఏర్పాట్లు పూర్తి - kodela sivaprasadarao
నరసారావు పేటలో సోమవారం నిర్వహించనున్న మాజీ స్పీకర్ కోడెల సంస్మరణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు, నేతలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో వసతి, భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు.
కోడెల సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి