ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల మృతికి సంతాపంగా.. గుంటూరులో ర్యాలీ - 144 section

కోడెల ఆత్మహత్యపై.. తెదేపా నేతలు ఆవేదన చెందారు. గుంటూరులో సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

కోడెల మృతిపై గుంటూరులో సంతాప ర్యాలీ

By

Published : Sep 17, 2019, 1:30 PM IST

కోడెల మృతిపై గుంటూరులో సంతాప ర్యాలీ

ప్రభుత్వ వేధింపుల వల్లే మాజీ సభాపతి కోడెల ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమంటూ తెదేపా నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడెల అమర్‌రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ నుంచి తెదేపా కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details