'అంతమాత్రానికి ఎన్నికలెందుకు? నామినేట్ చేసుకోవచ్చు కదా' - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, పోలీసుల సాయంతో గెలిచేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సీఎం జగన్ నియంతృత్వం, అహంకారానికి ఫ్యాక్షనిజం తోడైందని... రాయలసీమ ప్రాంతంలో విపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు నిర్వహించటం ఎందుకని... సహకార సంఘాల మాదిరిగా తమ పార్టీ వారినే నామినేట్ చేసుకుంటే సరిపోయేదని వ్యాఖ్యానించారు.
kanna laxmi naryana on local bodies elections