ఏపీకి మకాం మార్చిన నటుడు జయప్రకాశ్ రెడ్డి - ap
ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ విలక్షణ నటుడిగా పేరొందిన జయప్రకాశ్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి నివాసం మార్చారు
భవిష్యత్‌లో తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చే అవకాశముందని సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వయసు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన హైదరాబాద్ నుంచి గుంటూరుకు మకాం మార్చారు. ఎప్పుడైనా షూటింగులు ఉంటే ఇక్కడ నుంచే హైదరాబాద్ వెళ్తానన్నారు. తన కెరీర్‌లో తెలంగాణలోనూ ప్రజలు బాగా ఆదరించారని... ప్రస్తుతం సొంత రాష్ట్రానికి వచ్చిన సంతృప్తి ఉందన్నారు. కొత్త రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలు సినిమా చిత్రీకరణకు అనుకూలంగా ఉంటాయని జయప్రకాశ్‌రెడ్డి అన్నారు.