Janasena rythu bharosa yatra in Guntur district: కౌలు రైతుల భరోసా యాత్ర ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలలో కొనసాగుతోందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. కౌలు రైతులకు భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ యాత్ర చేయనున్నట్లు వెంకట మహేష్ వెల్లడించారు. ఈ యాత్రతోనైనా వైకాకాపా ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. సీఎం జగన్ తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు మాని కౌలు రైతులకు ఏంసాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంటలు పండి రైతుల నోటికి వచ్చే సమయానికి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నాశనమైపోతున్నాయన్నారు. జగన్ మోహన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని విమర్శించారు. ఐరన్ లెగ్ వలనే ఇలా జరుగుతున్నదని రాష్ట్రంలోని రైతులు అనుకుంటున్నారని మహేష్ ఆరోపించారు. జగన్ పాలనకు త్వరలో రాష్ట్ర ప్రజలు హాలిడే ప్రకటించనున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రల దెబ్బకి వైసీపీలో కలకలం మొదలైందన్నారు.
18 నుంచి ఉమ్మడి గుంటూరులో.. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర - పోతిన వెంకట మహేష్ వీడియోలు
Janasena rythu bharosa yatra in AP: కౌలు రైతుల భరోసాయాత్ర ఈ నెల 18 నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ నిర్వహించనున్నట్లు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వెల్లడించారు. ఈ యాత్రతోనైనా వైకాపా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే...ప్రభుత్వం బాధితుల కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని విమర్శించారు.
'పవన్ కల్యాణ్‌పై వైకాపా నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలి. తమ నాయకుడిపై ఆరోపణలు చేసే విషయంపై కాకుండా కౌలు రైతుల సమస్యలపై స్పందింస్తే బాగుంటుంది. రాష్ట్రంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను పవన్ పరమర్శిస్తారు. వారి కుంటంబానికి ప్రతి ఒక్కరికి రూ.1లక్ష అర్థిక సహాయం చేస్తారు. తమ నాయుకుడి ప్రచార రథంపై విమర్శలు చేస్తున్నారు. వారాహి అని పేరు పెడితే దానిపై అసత్య ప్రచారాలు చేశారు. వైసీపీ రాజకీయాలను సంహరించేదే వారాహి ప్రచార రథం.'- పోతిన వెంకట మహేష్ ,జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇవీ చదవండి: