Nadendla Manohar Fires On CM Jagan : జనసేనను రౌడీసేన అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకు.. పేదలకు ఇళ్ల పేరుతో చేసిన అవినీతిని వెలికి తీసినందుకు రౌడీ సేన అవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకు అవుతుందా అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను సీఎం కించపర్చారన్నారు. సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమని మనోహర్ అభివర్ణించారు.
"ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి సీఎం గారూ" - జనసేన
Nadendla Fires On CM Jagan Comments : నరసాపురం పర్యటనలో జనసేనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే??
Nadendla Manohar Fires On CM Jagan