ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అమరావతి విషయంలో జగన్ తీరు సరికాదు" - మంజూరు

అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ తీరు సరికాదని శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

.మాజీ సభాపతి కోడెల

By

Published : Aug 8, 2019, 8:24 PM IST

.మాజీ సభాపతి కోడెల

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పట్లో మంజూరు చేయద్దని స్వయంగా ముఖ్యమంత్రే... ప్రధానికి చెప్పడం బాధాకరమని ఉప సభాపతి, తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలు కోస్తా, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కానీ.. దాన్ని పూర్తిచేసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేనట్టు ఉందన్నారు. నీటి విషయంలో జగన్ అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.ఆగస్టు రెండోవారం అయినప్పటికీ ఇంతవరకు రైతులకు యాక్షన్ ప్లాన్ విడుదల చేయకపోవడాన్ని కోడెల తప్పుపట్టారు.

ABOUT THE AUTHOR

...view details