రాజధాని ప్రాంతంలో ఇనుము చోరీ చేస్తున్న దొంగలను గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి మండలం కురగల్లు, నీరుకొండ ప్రాంతంలో 36లక్షల విలువైన 76టన్నుల ఇనుమును చోరీ చేసిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్అండ్ టీ కి కేటాయించిన పనులు నిలిచిపోవటంతో నిర్మాణసామాగ్రి వద్ద కాపలాదారులను నియమించారు. రాత్రివేళలో ఎవరు లేని సమయంలో ఒడిశాకు చెందిన కాపలాదారులు రాజేంద్ర కుమార్, ఫకీర్ కుమార్ లు... స్థానికుల సహాయంతో ఇనుమును అపహరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు కాపలాదారులే ... చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులకు సహకరించిన 11 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇనుమును తరలించేదుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు.
కాపాలాదారుడే దొంగ... 76టన్నుల ఇనుము చోరీ
ఓ సంస్థకు చెందిన నిర్మాణ పనులు నిలిచిపోటంతో... నిర్మాణ సామాగ్రి వద్ద కాపలాదారుని నియమించారు. అక్కడున్న ఇనుముపై కాపాలాదారుని కన్ను పడింది. అనుకున్నదే తడవుగా స్థానికుల సహాయంతో 76 టన్నుల ఇనుమును దొంగలించాడు. ఏమీ తెలియనట్లు పోలీసులు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కాపాలాదారే దొంగగా తేల్చారు.
ఇనుము చోరీ చేశాడు...ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు